స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణ

సీనియర్‌ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో ప్రమాదవ శాత్తూ కాలుజారి పడ్డారు. నొప్పులు తీవ్రంగా ఉండటంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.