లాలుపురం జనసేన కార్యాలయంలో కలాం జయంతి వేడుకలు

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లాలుపురం గ్రామంలో గల జనసేన పార్టీ ఆఫిస్ లో ఆదివారం మాజా రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినామని ఆఫిస్ ఇన్చార్జి కాటూరి శ్రీనివాసరావు మాష్టారు ఒక ప్రకటనలో తెలియజేశారు. సామాన్య మానవునిగా భారతదేశంలో ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన కలాం దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. శాస్త్రవేత్తగాను, భారతదేశ అధ్యక్షునిగా భారత దేశం కీర్తి పతాకాన్ని ఎగురవేసినారని శ్రీనివాసరావు మాష్టారు అన్నారు. ఇంత గొప్ప మనిషిని ఈరోజు మేము గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అక్కి రవికుమార్, కార్యదర్శి తోట వెంకటేష్, నాయకులు లాలుపురం గ్రామ సీనియర్ నాయకులు శీలం శ్రీహరి, ఆదూరి శివయ్య, శివప్రసాద్, తన్నీరు వాసుదేవరావు, తన్నీరు రాము, జనసైనికులు ప్రతివాడ వీరయ్య, యు. మార్కండేయలు తదితరులు పాల్గొన్నారు.