రామన్నగూడెంలో జనసేన పల్లెపోరు

తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పల్లెపోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామన్నగూడెం గ్రామంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, గత పాలకుల యొక్క పరిపాలన తీరును ఎండగట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మరియు ముళ్ళపూడి కృష్ణమోహన్ నాయకత్వంలో యువ నాయకులు మద్దిపాడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొస్తే పాడైపోయిన మంచినీటి చెరువు అభివృద్ధి చేయటం దానితోపాటు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి తొమ్మిది కోట్ల రూపాయలతో ఎంపీ నిధులతో అభివృద్ధి చేశా, అధికారంలో లేనప్పటికీ మా సేవ చేయడం మాత్రం మానలేదు అది మా నిబద్ధత గతంలో నేను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధిని మర్చిపోకుండా ఈ తొమ్మిది కోట్ల రూపాయలతో గ్రామాభివృద్ధికి పాటుపడ్డాము గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునర్దీకరణ చేపడతాం. ఇప్పుడున్న పార్టీ కేవలం ప్రజలకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి అభివృద్ధిని తుంగలో తొక్కి పబ్బం గడుపుకుంటుంది. ప్రజల చేతుల్లో ఎంతో కొంత అమౌంట్ జమచేసి దాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిగా చూపించుకుంటుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తుని మన భావితరాలకు అందించే దిశగా ఓటు వేసి గెలిపించాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.