జనసైనికులకు అండగా నిలబడిన కందుల దుర్గేష్ మరియు బోడపాటి శివదత్

తుని జనసేన మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో జనసైనికుల పై పోలీస్ కేస్ నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టిన పోలీస్ కేస్ ఉపసంహరించుకుని.. జనసైనికులను స్టేషన్ నుంచి బయటకు పంపించే వరకూ.. ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే వుండి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జనసైనికులకు అండగా నిలబడడం జరిగింది. పదవులు అలంకరణ కోసం కాదు భాధ్యత కోసం అని జనసేన నాయకులు ఈ సందర్భంగా నిరూపించారు. ఇది జనసేన పార్టీ అంటే.