జనంలోకి జనసేన పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా రాజమండ్రి రూరల్ లో పోస్టర్ ఆవిష్కరించిన కందుల దుర్గేష్

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల ఇంచార్జుల చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ కందుల దుర్గేష్ వారి స్వగృహంలో “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం కందుల దుర్గేష్ శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయలతో భేటి అయ్యి జనసేనను బలోపేతం చేసేందుకు మరియు శతఘి న్యూస్ ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ శతఘ్ని న్యూస్ పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ప్రసాద్ మొండ్రేటి, శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల మరియు స్వామి రాజా పాల్గొనడం జరిగింది.