కత్తిపూడిలో జనసేన బహిరంగ సభ పార్కింగ్ స్దలాన్ని పరిశీలించిన కందులు దుర్గేష్

కత్తిపూడి: ఆదివారం సాయంత్రం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ కత్తిపూడి బహిరంగ సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ స్థలాలను, పెద్దాపురం డి.ఎస్.పి, ప్రత్తిపాడు సీ.ఐ, అన్నవరం ఎస్.ఐ అధికారులతో కలిసి పరిశీలించడమైనది. వాహనాల పార్కింగ్ స్థలాలు నిర్ధారించిన అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ కత్తిపూడి వారాహి వాహనంపై నుండి జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసినదిగా ప్రజలను జనసేన నాయకులను, జనసేన కార్యకర్తలను, జనసైనికులను వీరమహిళలను కొరియున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, ప్రత్తిపాడు జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ [బాబి], జనసేన నాయకులు చిక్కాల‌ బాబు తదితరులు పాల్గొన్నారు.