ప్రజల్లోకి దూసుకు పోతున్న కాంతి శ్రీ

*ఊరు, వాడ, ప్రతి పల్లే.. జనసేన ప్రభంజనం..
*అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఢీలా..
*యువత లో ఉరకలేస్తున్న ఉత్సాహం..
*అన్నీ వర్గాలనుంచీ జనసేనకు పెరుగుతున్న ఆదరణ..
*విస్తృత స్థాయిలో ప్రచారం, ర్యాలీ, పర్యటనలతో ప్రజల్లోకి దూసుకు పోతున్న జనసేన వీర మహిళ కాంతి శ్రీ.
*త్వరలో కాంతిశ్రీ కి జనసేన జిల్లా పగ్గాలు అప్పగించే అవకాశం.
*ఎచ్చర్ల సొంత నియోజకవర్గంలో అధికార వైసీపీకి ఎదురు గాలి.
*టిడిపి లో.. అసమ్మతి సెగలు తో కళా విహీనం.

శ్రీకాకుళం: జిల్లాలో జనసేనకు ఆన్ని నియోజక వర్గాలలో ఆదరణ పెరుగుతోంది. ఎపుడు ఎన్నికలు వచ్చినా.. జనసేన విజయమే లక్ష్యంగా జనసేన వీర మహిళ కాంతి శ్రీ నాయకత్వంలో అన్నీ వర్గాల ప్రజలతో మమేకమై జనసైన్యం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలన, అన్నదాతల ఇబ్బందులు, గ్రామాల్లో రహదారులు, రైతుల పక్షానఅధికార వైసీపీ పై పోరాటాలతో కాంతిశ్రీ నాయకత్వంలో ఆన్ని నియోజక వర్గాలలో దూసుకు పోతోంది. ఎచ్చెర్ల నియోజక వర్గంలో జనసేనకు ఆన్ని మండలాలు, గ్రామాల్లో అపూర్వ ఆదరణ లభిస్తోంది. నియోజక వర్గ ఇంచార్జీ గా కాంతిశ్రీ జనసేన సంస్థాగత బలోపేతానికి, అధికా ర వైసీపీ, విపక్ష టీడీపీ నుంచీ భారీ స్థాయిలో జనసేన పార్టీలో చేరికలతో ఎచ్చెర్ల నియోజక వర్గంలో జనసేన బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా కాంతి శ్రీ నాయకత్వంలో పటిష్టంగా ఉంది. అన్ని నియోజక వర్గాలను కలియ తిరుగుతూ.. బలమైన క్యాడర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ.. అన్ని వర్గాలను జనసేనకు చేరువ చేసి జనాదరణదిశగా.. క్రీయా శీలక రాజకీయాలలో కాంతి శ్రీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు, భావాజాలం, రైతులు, నిరుజ్యోగ యువత, సామాన్య, పేద మధ్య తరగతి వర్గాలతో పాటు దళితులు, వెనుకబడిన వర్గాలపై జనసేన పార్టీ కమిట్ మెంట్ తదితర అంశాలను కాంతి శ్రీ గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన, చేరువ చేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే సొంత నియోజకవర్గంలో అధికార వైసీపీ కి ఎదురు గాలి వేస్తోంది. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ ఒంటెద్దు పోకడ, సొంత పార్టీ నుంచి అసమ్మతి, అవినీతి, వైసీపీక్యాడర్ ను ఎమ్మెల్యేపట్టించు కోవడం లేదన్న విమర్శలతో గొర్లే కిరణ్ కుమార్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. రానున్న ఎన్నికలలో ఈ ప్రభావం అధికార వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు సొంత పార్టీ టీడీపీ నుంచి ఇంటి పోరు తీవ్రంగా ఉంది.. సీనియర్ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఇటీవల కాలం వరకూ వ్యవహరించిన కిమిడి కళా వెంకట్రావుకు కంట్లో నలుసులా కలిశేట్టి అప్పలనాయు డు వ్యవహారం ప్రభావం రాబోవు ఎన్నికల్లో జనసేనకు కలిసి వచ్చే అంశం.. ఏదీ ఏమైనప్పటికి.. జిల్లాలోనూ, ఎచ్చర్ల నియోజక వర్గంలో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ పార్టీగా కాంతి శ్రీ నాయకత్వంలో జనసేన ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని అన్నీ వర్గాల ప్రజల నుంచీ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో కాంతి శ్రీ కి జనసేన పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.