అంగన్వాడి ఉద్యోగులకు మద్దతు తెలిపిన కరప మండల జనసేన

కాకినాడ రూరల్, అంగన్వాడీల పట్ల, ఐసిడిఎస్ పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ ఆదేశాలతో ఐదవ రోజు అంగన్వాడి ఉద్యోగులకు మద్దతు తెలిపిన కరప మండల జనసేన పార్టీ, తెలుగుదేశం నాయకులు. ముందుగా శాసనమండలి సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించిన షేక్ సాబ్జ్జికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఏమంటారు అని అన్నారు. మాట్లాడితే మాట తప్పం మడం తిప్పం అంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం అంటే ఇదేనా..? ఈ విషయాన్ని గుర్తు చేసి నిరసన తెలియజేస్తుంటే వేధింపులకు గురి చేయడం పాలకులు నైజాన్ని తెలియజేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి పంచనామాలు చేస్తామని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. ఈ అంగన్వాడి వ్యవస్థపై ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా నిధులు తప్పుదారి పట్టించారో మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ లెక్కలతో సహా బయటపెట్టారు. నిన్న కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో వైసీపీ నాయకులతో కలిసి అంగన్వాడీ కేంద్రానికి బదులుగా పక్కింటి వారి తాళాలను పగలగొట్టినట్టుగా వార్తలు వచ్చాయి. వెంటనే విషయం బయటకు పొక్కకుండా ఆ ఇంటికి కొత్త తాళం కప్ప తెప్పించి వేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 52,000 అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికి పైగా మహిళలు ఉద్యోగులుగా అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు వెంటనే పెంచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింపచేయాలి. ఈ అంగన్వాడి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలి. 2024లో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని మీ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించే దిశగా మా అధినాయకత్వానికి తెలియపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కరప మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల పవన్ కుమార్, కరప మండల సీనియర్ నాయకులు బిరుదా వీర వెంకట సత్యనారాయణ(బాబు), తెలుగుదేశం పార్టీ కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టిడిపి నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.