ఆత్మ రక్షణ కు కరాటే విద్య ఎంతో అవసరం: ఎం హనుమన్

  • కరాటే శిక్షణ తీసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్ లు అందజేసిన జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం హనుమన్

విజయవాడ, కేదరసే పేటలోని ఫ్యూచర్ పాత్ స్కూల్ నందు కరాటే బెల్ట్ టెస్ట్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కరాటే శిక్షణ తీసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్ లు అందజేడం జరిగింది. ఆత్మ రక్షణ విద్య మహిళలకు ఈ రోజుల్లో చాలా ముఖ్యమని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మ రక్షణ విద్య నేర్చుకోవాలని, ఆత్మరక్షణ మార్షల్ ఆర్ట్స్ విద్య మన ప్రాచీన విద్య, మన ప్రాచీన కళను మనం గుర్తించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఫ్యూచర్ పాత్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ కు మరియు జగదీష్ ప్రసాద్ ఒకినావాన్ గోజు ర్యు కరాటే స్కూల్ అఫ్ ఇండియా కు కృష్ణా డిస్ట్రిక్ట్ చీఫ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం హనుమన్ మాట్లాడుతూ క్రౌ మగ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి వెలుగులోనికి తీసుకొచ్చింది హనుమాన్ అండ్ డేర్ టీం. ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ముఖ్యంగా మహిళలకు ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటన గాని ఈవ్ టీజింగ్ నుండి మహిళలు తమను తాము రక్షించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఆత్మరక్షణ శిక్షణ, ఈ శిక్షణను తల్లిదండ్రులందరూ తమ పిల్లలను నేర్పించే విధంగా పిల్లలను ఆత్మ రక్షణ క్లాసులకి పంపించి వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరారు. కరాటే అంటే ఒక సర్టిఫికెట్స్ గురించి నేర్చుకోనెది కాదు. స్పోర్ట్స్ కోటాలోనూ కరాటే చేర్చబడింది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా దీనికి రిజర్వేషన్ అనేది కల్పించారు, కరాటే మన ఒలంపిక్స్ లో ఉండడం కూడా మనకు గర్వకారణం. ఆత్మ రక్షణకు, చురుకుతనానికి, స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలను సంపాదించడానికి అన్నిటికీ ఈ కరాటే అనేది చాలా చాలా ఉపయోగపడుతుందని, కాబట్టి కరాటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందిగా హనుమన్ తెలిపారు.