కార్తీకమాసం భక్తుల కోసం నీళ్లు ఏర్పాటుచేసిన లింగోలు పండు

అమలాపురం, దీపావళి మరునాటి నుండి స్త్రీలు నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే కార్తీకమాసం చివరి రోజు తెల్లవారు జామున కాలువలో చన్నీటి స్నానం చేసి భక్తితో పూజలు నిర్వహించి నీటిలో(కాలువలో) దీపాలు వదులుతారు, స్థానిక నల్ల వంతెన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద గల పంట కాలువలో నీరు లేకపోవడంతో తెల్లవారు జామున వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండ ఉండటం కోసం అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు అధ్వర్యంలో 20 డ్రమ్ములు వాటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లా రామ్మూర్తి, RDS ప్రసాద్, గంగాబత్తుల కిషోర్, DNS కుమార్, యర్రంశెట్టి సతీష్, డెక్కల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.