జనసేన నాయకులతో భేటీ అయిన కావ్య కృష్ణారెడ్డి, అళహరి సుధాకర్

కావలి నియోజకవర్గం: జనసేన – టీడీపి ఆత్మీయ సమావేశం శనివారం 8వ తారీకున సాయంత్రం 3 గంటలకు టీడిపి కర్యాలయములో నిర్వహించుకోబోతున్న సందర్భముగా, జనసేన – టీడీపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డి జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి ఇంఛార్జి అళహరి సుధాకర్ తో కలిసి నియోజకవర్గ జనసేన నాయకులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కావలిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకులు నిర్దేశించిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్దిని గెలిపించుకునే విధంగా కార్యాచరణ ఏవిధంగా ఉంటుందో అనే అంశాలమీద దిశా నిర్దేశనం చెయ్యడము జరిగింది. ఇరువురు ఇంచార్జీలు రేపు జరగబోయే ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా జరిపుకునెలా ప్రణాళిక చేసుకున్నారు. ఈ కార్యక్రమములో పట్టణ అధ్యక్షుడు పోబ్బా సాయ, అధికార ప్రతినిధి రుషికేశ్, రూరల్ అధ్యక్షుడు గుడిపల్లి వేంకయ్య, అల్లూరు మండల అధ్యక్షుడు కార్తిక్ శర్మ, బోగోలు అధ్యక్షుడు వెంకటేష్ తో పాటు అన్ని మండల నాయకులు, వార్డ్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.