గవర్నర్‌ను పరామర్శించిన కేసిఆర్

తెలంగాణ గవర్నర్ తమిళిసైను ముఖ్యమంత్రి కేసిఆర్ పరామర్శించారు. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత కుమార్‌ కరోనాతో చనిపోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను పరామర్శించారు. వసంత కుమార్‌ అంత్యక్రియల వీడియోలను సీఎంకు గవర్నర్‌ చూపించారు. ఆయన మృతి తనను ఎంతో కలిచివేసిందని సీఎం అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.