డెక్కన్ ఆసుపత్రి అనుమతి రద్దు చేసిన కేసీఆర్ సర్కారు

కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు, కథనాలు పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి. అయినప్పటికీ పెద్దగా స్పందించని తెలంగాణ సర్కారు తాజాగా స్పందించింది.

కేసీఆర్ సర్కారు కరోనా టెస్టులో నెగిటివ్ గా తేలిన వ్యక్తికి పాజిటివ్ అని చెప్పి వైద్యం చేసి.. వార్తల్లోకి ఎక్కిన డెక్కన్ ఆసుపత్రి అనుమతి రద్దు చేసింది. తెలంగాణలో వేటు పడిన తొలి ప్రైవేటు ఆసుపత్రిగా డెక్కన్ ఆసుపత్రి నిలిచింది. తాజాగా ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కొత్త కరోనా కేసుల్ని ఆడ్మిట్ చేసుకోవటానికి వీల్లేదు. అంతేకాదు.. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు ప్రైవేటు ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఆదేశించిన ధరలకు మాత్రమే చికిత్స చేయాలని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పింది. తాజాగా తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.