కె.సి.ఆర్. కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు కె.సి.ఆర్. ఎంతటి జఠిలమైన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం కె.సి.ఆర్ ని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. సమకాలీన రాజకీయనాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కె.సి.ఆర్ లోని మరో ప్రత్యేకత. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్ధులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం. రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు నాకూ ఆనందాన్ని కలిగించింది. నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కె.సి.ఆర్ కి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/pawang-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-17-at-5.20.53-PM-723x1024.jpeg)