వాటర్‌ ట్యాక్సీలను ప్రారంభించిన కేరళ

కేరళ ప్రభుత్వం పడవ ప్రయాణాలు చేసే ప్రజలు, పర్యాటకుల కోసం మొట్టమొదటి సారిగా వాటర్‌ ట్యాక్సీలను ప్రారంభించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం అలప్పుజ, ఫెర్రిడ్‌ బ్యాక్‌ వాటర్‌లో దీనిని ప్రారంభించారు. ఈ ట్యాక్సీ సేవలలో కాటమెరన్‌ డీజిల్‌ పవర్డ్‌ క్రాప్ట్‌లను ఉపయోగించనున్నారు. వీటిలో పదిమంది ప్రయాణించవచ్చు. స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎస్‌డబ్ల్యూటీడీ) ఈ సేవలలో ప్రస్తుతం నాలుగు క్రాప్ట్‌లను ఉపయోగించాలని ప్రణాళికలు వేస్తోంది. సేవలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాత క్రాప్ట్‌లను ఆర్డర్‌ చేసింది ఎస్‌డబ్ల్యూటీడీ. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు, అలప్పుజ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రయాణాల కోసం పడవలపై ఆధారపడే వారికీ ఈ వాటర్‌ ట్యాక్సీల సేవలు అందుబాటులో ఉంటాయి.