చతుర్థి వేడుకలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధం

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏటా వినాయకచవితికి ముందు రోజు నుంచి దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణేశుడు ఈసారీ అలాగే భక్తులకు దర్శనమివ్వనున్నారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆదివారం విగ్రహం ముందున్న కర్రలను తొలగించడంతో భక్తులు చవితికి ముందే దర్శించుకొని సెల్ఫీలతో సంబరపడుతున్నారు.