‘ఖిలాడీ’ ఫస్ట్ లుక్ విడుదల!

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తుంది. టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై టీమ్ మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.  ఇదిలా ఉండగా రవితేజ త్వరలో ‘వీర’ సినిమా దర్శకుడు రమేష్ వర్మతో తన 67వ చిత్రం చేయనున్నాడు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ మూవీకి ఖిలాడీ అనే టైటిల్‌ని పెట్టారు.

రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ మూవీస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా… డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మరో అద్భుత ప్రయాణానికి సర్వం సిద్ధం’ అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.