కిసాన్ వికాస్ పత్ర వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్

డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నవారికి  పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం అందుబాటులో ఉంది. కిసాన్ వికాస్ పత్ర అనేది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కీమ్ మెచ్యూరిటీ కాలం వరకు ఆగాలి. అటుపైన డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలి. కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ కాలం 124 నెలలు. కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రజల్లో దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్లు, సేవింగ్స్‌ను పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఈ పథకంలో చేరొచ్చు. డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం పోస్టాఫీసుల్లో మాత్రమే కాకుండా పలు బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. 18 ఏళ్లు వయసు దాటిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.

కిసాన్ వికాస్ పత్రాలపై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే మీ డబ్బు ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. రూ.10 లక్షలు పెడితే రూ.20 లక్షలు లభిస్తాయి. ఇకపోతే ఈ పథకంలో చేరాలని భావించే వారు అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.