KKR vs CSK: టాస్ గెలిచిన కేకేఆర్

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా జరగనున్న 21వ మ్యాచ్‌లో కోల్‌కతా, చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కోల్‌కతా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండిట్లో గెలిచి.. మరో రెండిట్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మళ్ళీ విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యా్చ్‌లు ఆడగా మూడింట్లో ఓడి.. రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి మంచి ఉత్సాహంతో ఉంది. ఈ బిగ్ ఫైట్‌లో గెలిచి మరో విజయాన్ని తన ఖాతలో వేసుకొవాలని చూస్తుంది.