కోనాల కాళీ కృష్ణ తేనీటి విందుకు హజరైన జనసేన నాయకులు

భీమవరం: సింగపూర్ జనసేన మెంబర్ కోనాల కాళీ కృష్ణ స్వగృహము నందు ఏర్పాటుచేసిన తెనేటి విందుకు భీమవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జనసేన పార్టీ మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), సూర్య ప్రకాష్ రావు జనసేన నాయకులు ( ఎక్ష్ కౌన్సిలర్), సుంకర రవి (టౌన్ సెక్రటరీ), కొమ్మూరి రామారావు (లీగల్ సెల్)జి.వి.ఐ.టి, అప్పారావు, మగపు భగత్ సింగ్, రాంప్రసాద్, పెద్దేటి తేజ, ఆకుల శ్రీనివాస్, మరి కొందరు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి యువత అమ్మవారి జాతరలో చేస్తున్న అల్లర్లు మంచిది కాదని, అవి అరికట్టాలని చర్చించారు. ఈ సందర్భంగా కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ యువత మరియు కోనాల కాళీకృష్ణ గారు లాంటి ఉత్తమమైన మనుషులు జనసేన పార్టీలో ఉండడం మన అందరి అదృష్టం అని, అలానే కోనాల కాళీకృష్ణ జనసేన పార్టీ పేరు మీద చేసే మంచి పనులు అలానే ఆయన వ్యక్తిగతంగా పేదలకు చేస్తున్న మంచి పనులు గురించి చెప్తూ ప్రశంసించారు. అలానే ఇప్పుడు ఉన్న యువత డ్రీమ్స్ ను సపోర్ట్ చేస్తూ షార్టుఫిలిం ప్రొడ్యూస్ చెయ్యడం చాలా మంచి పని అని, అలానే రైటర్ గా కూడా మంచి కథలు అందించడం అనేది ఆయనకి కళ పట్ల ఉన్న ఇష్టంని చెప్తుంది అని, అలానే ఇలాంటి ఉత్తమమైన వ్యక్తులు పార్టీలోకి ఇంకా రావాలి అని యువత కూడా రావాలని మాట్లాడారు. అలానే కోనాల కాళీకృష్ణ గారు ఇంటిలోపల వేయించిన జనసేన లోగో చూసి కార్యకర్తలు మరియు కొటికలపూడి గోవిందరావు ప్రశంసించారు. తేనేటీ విందు తర్వాత పార్టీ మెంబర్స్ అందరూ కూడా పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు, కార్యక్రమంలో భాగంగా కోనాల కాళీకృష్ణ మరియు దివ్యజ్యోతి ఆహ్వానితులైన కార్యకర్తలను శాలువాతో సత్కరించి, ప్రశంసించారు. కోనాల కాళీకృష్ణ మాట్లాడుతూ అడిగిన వెంటనే చినబాబు గారు (కొటికలపూడి గోవిందరావు) ఇంటికి రావడం ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వంని చూపిస్తుందని అన్నారు, అలానే విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలానే ముందు ముందు పార్టీకి, పార్టీ కార్యకర్తలకు ఎటువంటి అవసరం వచ్చిన సింగపూర్ జనసేన మెంబర్స్ గా అందరం తోడు ఉంటామని చెప్పారు, ఈ సమావేశం మంచి వాతావరణంలో జరిగింది.