క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన గాదె

బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, దమ్మనవారి పాలెంలో జనసైనికుడు గుర్రపుశాల భరత్ చంద్ర రోడ్డు ప్రమాదానికి గురైనాడు. భరత్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉన్నందున అతనికి హాస్పటల్ ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయల ఇన్సూరెన్స్ శాంక్షన్ కాగా, ఇన్సూరెన్స్ చెక్కుని రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పంపించడం జరిగింది. సోమవారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆ చెక్కు ను తీసుకుని దమ్మనవారి పాలెంకి వచ్చి మొదటగా నాయకులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించి, అనంతరం గుర్రపుశాల భరత్ చంద్ర నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆ చెక్కుని అందజేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, తులసి కుమారి, శివన్నారాయణ, మేకల రామయ్య యాదవ్, అప్పారావు, మండల అధ్యక్షులు శ్రీకృష్ణ, సుబ్బారావు గ్రామ అధ్యక్షులు మడసాని బాలాజీ, గ్రామ పెద్దలు, నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు..