కొండపి నియోజకవర్గ జనసేన మండలాల అధ్యక్షుల సమావేశం

కొండపి నియోజకవర్గం: జనసేన పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు సమావేశం ఈరోజు కొండపిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయుల శ్రీ షేక్ రియాజ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడానికి దిశా నిర్దేశం షేక్ రియాజ్ మండలాల అధ్యక్షులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలను ప్రతినిత్యం అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చూపించే విధంగా మండల అధ్యక్షులు కృషి చేస్తున్నారు. జనసేన పార్టీ సభ్యత్వం అత్యధికంగా కొండపి నియోజకవర్గంలో జరగడం ప్రజల్లో మార్పు వచ్చింది అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ, వైసీపీ పరిపాలన వలన సామాన్య మానవుడి నుండి ప్రతి రంగంలో కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి లేక వలసల ప్రవాహం ఎక్కువ అవుతుంది, కొండపి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే జనసేన ప్రభుత్వం ఏర్పాటు జరగాలి, జనసేన కచ్చితంగా విజయం సాధిస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఒక్కొక్క మండలం నుండి 10 వేల ఓట్లు, అదేవిధంగా ఆరు మండలాల నుండి 60 వేల ఓట్లు సాధించగల సత్తా జనసేన పార్టీకి ఉంది. ప్రస్తుతం ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరఅభిమానం వైసిపి పార్టీ కంటే జనసేన పార్టీకి ఎక్కువగా ఉంది, ప్రశ్నించడానికి ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజల పక్షాన అండగా నిలవడానికి పుట్టిన పార్టీయే మన జనసేన పార్టీ అని ఆరు మండలాల అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐయినాబత్తిన రాజేష్ (సింగరాయకొండ), కనపర్తి మనోజ్ కుమార్ (పొన్నలూరు), గూడా శశిభూషణ్ (జరుగుమల్లి), కందుకూరి రాంబాబు(టంగుటూరు), మారిశెట్టి చంద్రశేఖర్(మర్రిపూడి), యనమద్దిని విశ్వనాగబ్రహ్మ (కొండపి) మొదలైన కొండపి నియోజకవర్గం ఆరు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.