దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితం: ఆస్ట్రేలియా

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. తాజాగా ఈ మేరకు ఆస్ట్రాజెనెకా కంపెనీ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ ను తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను కట్టిడి చేయడానికి అగ్రదేశాలు రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్  అభివృద్ధి పనిలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడో దశ ట్రయల్స్ లో ఉన్న 5 వ్యాక్సిన్ లలో ఇదొకటి. మూడో దశ ట్రయల్స్ సమర్ధవంతంగా కొనసాగుతున్న ఈ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో వస్తుందని నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ఈ కంపెనీతో ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మోరిసన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాక్సిన్ విజయవంతమైతే తమ దేశంలోనే ఉత్పత్తి చేసి పంపిణీ చేసే విధంగా ఆ కంపెనీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం  అగ్రిమెంట్ చేసుకుంది.