అత్యవసర వినియోగానికి ‘కోవిషీల్డ్‌’

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ ప్రక్రియ వ్యక్తిగతంగా సమీక్షించేందుకు శనివారంమోదీ టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. ఈ నేపధ్యం లోప్రధాని మోదీ శనివారం పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు. మోదీ సందర్శించిన అనంతరం కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి సీరం ఇనిస్టిట్యూట్‌ రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు సీరం ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఎవరు ఎన్ని మోతాదులు కొనుగోలు చేస్తారనే సమాచారం లేదని, కానీ జూలై 2021 నాటికి 300-400 మిలియన్‌ డోసులు మోతాదులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం రాబోయే రెండు వారాల్లో దరఖాస్తు చేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు.

ప్రస్తుతం కోవిషీల్డ్‌ ట్రయల్స్‌, భద్రతపై స్పందిస్తూ ప్రస్తుతానికి ట్రయల్స్‌ సమర్థవంతంగా ఉందని చెప్పారు. 18 ఏళ్లపైబడిన వ్యక్తులకు టీకాలు వేయగా.. మెరుగైన ఫలితాలు చూపిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 50-60 మిలియన్‌ డోసులు, జనవరి తర్వాత 100 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు.