కోవూరు ప్రజలు సమస్య అని నోరెత్తితే దాడి చేసే పరిస్థితి: గునుకుల కిషోర్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, గత పది సంవత్సరాలుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచరుల కనుసైగలలో కోవూరు ప్రజలు సమస్య అని నోరెత్తితే దాడి చేసే పరిస్థితి నెలకొంది. కోవూరు నియోజకవర్గం అడుగడుగునా ప్రజా సమస్యలతో ప్రతినిధుల నిర్లక్ష్యానికి గురయ్యి ఉంది. కనిగిరి రిజర్వాయర్ వద్ద వందల కోట్ల గ్రావెల్ అక్రమ రవాణా అవుతున్న పట్టించుకునే నాధుడే లేడు. షుగర్ ఫ్యాక్టరీ మూసి వేసేటప్పుడు ఇచ్చిన హామీలు పూర్తికాలేదు పునరుద్ధరణ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఉన్న దానిని పట్టించుకునే పరిస్థితి లేదు. 65 గ్రామాల కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి,అభివృద్ది శూన్యం. అణగారిన వర్గాలకు అండగా తుపాకుల మునెమ్మకు ఇచ్చిన సీటు తాలూకు ఓటు బ్యాంకు మూడింతలై ఈసారి జనసేన పోటీ చేస్తే గెలుపొందే అవకాశం ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు.