జనసేనలో చేరిన కొవ్వాడలంక యువత

  • మదర్ థెరిస్సా జయనతి సందర్భంగా ఘననివాళులు

కైకలూరు, మండవల్లి మండలం, కొవ్వాడలంక గ్రామానికి చెందిన 50 మంది యువత కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికలు ఇన్చార్జిలు కొల్లి వరప్రసాద్(బాబీ), నల్లగోపుల చలపతి, వీర మహిళ తోట లక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం కైకలూరు పట్నంలోని నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి కొవ్వాడలంక యువత పార్టీలో చేరడానికి విచ్చేయగా పార్టీ కండువా కప్పి జనసేన నాయకులు యువతను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించడం పట్ల ఆకర్షితులమయ్యామన్నారు. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల ఇన్చార్జులు కొల్లి వరప్రసాద్, నల్లగోపుల చలపతి, తోట లక్ష్మి మాట్లాడుతూ కొల్లేరు గ్రామాల నుండి ఇంత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరడం మంచి శుభ పరిణామం అన్నారు. కొల్లేరు సమస్యల పరిష్కారం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా ముందుకు తీసుకుని వెళ్తామని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే నిత్యం ప్రజా సమస్యలపై పోరాడతూ వారి సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తుమన్నారు. అనంతరం నిస్వార్థ సేవకు నిదర్శనమైన మదర్ తెరిస్సా జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు మండల పార్టీ ఉపాధ్యక్షురాలు సొంటి రాజేశ్వరి, కేశన సంజన, యువ నాయకులు కొటికలపూడి ఈశ్వర్ నాయుడు, ముత్యాల తరుణ్, తోట కార్తీక్ ప్రసాద్, ఘంటసాల జయంత్ తదితరులు పాల్గొన్నారు.