తిరువూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ

తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలంలో ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి వివరాలు సేకరించిన కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ. ముందుగా పార్టీ శ్రేణులతో కలిసి వినగడప కట్టలేరు వంతెనను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాహనచోదకులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే ఈ కట్టలేరు వంతెనను గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిని తక్షణమే నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి డిసెంబర్ నాటికి 40 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులు మొదలు పెడతామని ఇటీవల చెప్పారని… కానీ ఇంతవరకూ దాని ఊసే ఎత్తడం లేదని ఎంతకాలం ఇలా ప్రజలను మోసంచేస్తారని స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించారు.అనంతరం ఆయన జిల్లా సహచర కార్యవర్గ సభ్యులతో కలిసి నల్ల తామర వల్ల వేల ఎకరాల్లో పంట నష్టపోయిన మిర్చి రైతులను కలిసారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు కానీ మిర్చి రైతుల విషయంలో స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. గంపలగూడెం మండలంలోని మేడూరు, పెనుగొలను, ఊటుకూరు, జింకలపాలెం, గాదెవారి గూడెం,ఆర్లపాడు తదితర గ్రామాలలో వేల ఎకరాల్లో మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరితగతిన ఈ మిర్చి పంట సాగును “ఈ క్రాప్” లో నమేదు చేసి మిర్చి రైతులకు ఇన్సూరన్స్ పరిహారం అందేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలన్నారు. జిల్లా జనసేన కార్యవర్గ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి మిర్చిపంట నష్టం, మరియు రైతుల సమస్యల గురించి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల మేడూరు గ్రామంలో ఆకస్మిక మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త కోలాకోటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి ఓదార్చి వారి కుటుంబానికి తక్షణ అవసరాల నిమత్తం 15 వేల రూపాయలను అందజేసి మరణించిన కార్యకర్త పిల్లలకు జనసేన పార్టీ అండగా ఉండే విధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియజేయనునట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యదర్శి శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు ఉస్మాన్ షరీఫ్, శ్రీమతి రెడ్డి మణి, గాదె వారి గూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, తిరువూరు నియోజకవర్గం నాయకులు చింతలపాటి వెంకట కృష్ణ ఉయ్యూరు జయప్రకాష్ వట్టి కుంట కృష్ణ, ఉర్వి సర్పంచ్ సురేష్, పసుపులేటి మాధవరావు సాయిబాబా, పట్రారవి, రామకృష్ణ మాధవ మరియు రైతులు పాల్గొన్నారు.