డాక్టర్ శ్రీధర్ పిల్లా సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామ జనసేన సైనికుల ఆధ్వర్యంలో జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం నందు దాదాపు ఎనిమిది వందల మందికి పైగా ఉచిత వైద్య శిబిరంలోని ఉచిత సేవలను ఉపయోగించుకున్నారు, దీనిలో డాక్టర్ శ్రీధర్ పిల్లా జనరల్ మెడిసిన్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు, డాక్టర్ ఎం. ఉషశ్రీ, స్త్రీల ప్రసూతి వైద్య నిపుణులచే స్త్రీల విభాగం, డాక్టర్ కే. అనుష్, జనరల్ సర్జన్, డాక్టర్ రాజీవ్ కన్నా, ఆర్థోపెడిక్ సేవలను ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ దీనిలో ముఖ్యంగా మూడు అంశాలను చెప్పడం జరిగింది.. దానిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, న్యాయం సగటు మానవుడికి అందే విధంగా ఉండాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయం అనేది దొరకడం చాలా కష్టంగా ఉందాని ముందుముందు ఇలానే ఉంటే న్యాయం అన్నదే కనిపించకుండా పోతుంది. 2024 లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి పాలన మారాలి, పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే క్షమించే వ్యక్తి కాదు న్యాయం కోసం పోరాడే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీనిలో భాగంగా డాక్టర్ సతీమణి శ్రీమతి డాక్టర్ పిల్లా దీపికా, నియోజకవర్గ వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి, జనసైనికులు మరియు నాయకులు ఆర్. వీరభద్రరావు, ఐ. వీరబాబు, ఎం. శ్రీను, ఎస్. సురేష్, కే. గంగాధర్, పి. సోమేశ్వరరావు, పి. వెంకటేశ్వరరావు, ఎస్. స్వామి, పి. త్రిమూర్తులు, బి. అప్పారావు, కే. శివ, ఐ.కొండలరావు, టి.నవీన్, యు సుధీర్, యు శ్రీ తేజ, జి శ్యామ్, కే నాని, ఏ వీరబాబు, పి కొండబాబు, కే వాసు, ఎస్ రాజు, పి శివ, వి సురేష్, ఐ గిరి, ఐ శ్రీను, వి శ్రీను, ఊటా నాని బాబు, పిల్లా ముత్యాలరావు బిజెపి నాయకులు, పిల్లా దినేష్, వాకపల్లి సూర్య ప్రకాష్, ఎం దొరబాబు, జి గోవింద్ రాజ్ పిల్లా శివశంకర్,ఆర్ సూరిబాబు, కన్నా బత్తుల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *