ఆంధ్రజ్యోతి పత్రికా విలేఖరిపై దాడిని ఖండించిన కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, వైయస్ జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం మీరు? విలేకరుల పైన దాడులు చేయించడానికి సిద్ధమా? నీ రాజకీయ బహిరంగ సభలలో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి నీవు పైశాచిక ఆనందం పొందడానికి ఆ ఫోటోలు పైన అభం శుభం తెలియని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి, నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైసిపి కార్యకర్తలని ఉన్మాదులుగా తయారుచేసి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా సైకో జగన్ రెడ్డిగారు? ఆంధ్రజ్యోతి పత్రికా విలేఖరి కృష్ణాపై వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే అధికార మదమెక్కి దాడి చేసిన వైసిపి గుండాలను అదుపులోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.