అచ్చప గ్రామంలో పర్యటించిన కూరంగి నాగేశ్వరరావు

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం అచ్చప గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కూరంగి నాగేశ్వరరావు (ఎస్.బి.ఐ రిటైర్డ్ మేనేజర్) మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న మహిళలను ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రజలు జనసేన నాయకులు కూరంగి నాగేశ్వరరావుతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా జగన్ వైసిపి పాలనలో మోసపోయామని, ఈ ప్రభుత్వ ఐదేళ్లలో ఏ న్యాయం మాకు చేయలేదని వాపోయారు. గిరిజనులతో కోరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు గిరిజనుల యొక్క హక్కుల మీద పోరాడే వ్యక్తి అని, గిరిజనులకు ఏం కావాలో అన్ని విధాల ఆయన అధ్యయనం చేశారని, జనసేన ప్రభుత్వం వచ్చాక అన్ని విధాల క్షేత్రస్థాయి లో సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారని గిరిజన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీతంపేట మండల అధ్యక్షులు మండంగి విశ్వనాథం, దుర్గారావు, పాలకొండ మండల జనసేన నాయకులు డొంపాక సాయి కుమార్ పాల్గొన్నారు.