పసుపులేటి హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ సభ్యులు

చిత్తూరు, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ని జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఆయన తీసుకుంటున్న మంచి నిర్ణయాలు జనసేన పార్టీని బలోపేతం దిశగా తీసుకుపోతున్న విధానాలు అందరితో పలు విషయాల మీద చర్చించడం, కడప జిల్లాలో జనసేన పార్టీని ప్రతి పల్లెలో బలపరచడం, జనసేన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు.