లాలుపురం: జనసేన క్యాలండర్ ఆవిష్కరణ..

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, లాలుపురం గ్రామంలో లాలుపురం జనసేన వీరమహిళలు మరియు కార్యకర్తల చేతుల మీదగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు శీలం శ్రీహరిరావు, శీలం చిన్న, తోట శివ, దామారచర్ల రామాంజి, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు, వీరామహిళలు పాల్గొన్నారు.