భూకబ్జాధారులను వెంటనే అరెస్ట్ చెయ్యాలి: దేవర మనోహర

చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం, రామాపురంలో క్రితం 29వ తారీఖు వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూమిని పరిశీలించటానికి వెళ్లిన బీజేపి నాయకులపై భౌతిక దాడిని ఖండిస్తూ జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో రొడ్డురోకో చేసి నిరసన తెలియచేయడం జరిగింది. అటు తరువాత కాలినడకన నిరసన తెలుపుతూ స్థానిక ఎమ్మార్వో ని కలిసి వినపత్రం అందచేసి వెంటనే స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, బీజేపీ నియోజకవర్గ నాయకులు మేడసాని పురుషోత్తం, మండల అధ్యక్షులు సంజీవిహారి, కిరణ్, వాసు, డిల్లీ, పవన్, లోకేష్ ఇతర జనసేన – బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.