భూదాటి లక్ష్మీనారాయణ ను బర్త్ రఫ్ చేసి, టిటిడి పవిత్రతను కాపాడాలని జనసేన నిరసన

  • టీటీడీ పాలకమండలి సభ్యులా!.. దొంగల ముఠా సభ్యులా.!
  • భూదాటి లక్ష్మీనారాయణను వెంటనే బర్త్ రఫ్ చేయాలి..
  • టిటిడి పవిత్రతను కాపాడండి.. జనసేన

భూదాటి లక్ష్మీనారాయణ ను టీటీడీ పాలకమండలి నుంచి బర్త్ రఫ్ చేసి, టిటిడి పవిత్రతను కాపాడాలని మంగళవారం అలిపిరి పాదాల వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తలియజేసారు..

ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ వీరు టీటీడీ పాలకమండలి సభ్యులా లేక దొంగల ముఠా సభ్యులా అని ప్రశ్నిస్తూ, వందల కోట్లు అక్రమాలకు పాల్పడి సామాన్య ప్రజల వద్ద నుంచి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి డబ్బులు కాజేశారని అతనిని వెంటనే పదవి నుంచి తొలగించాలని టిటిడి ధార్మిక సంస్థలను కాపాడాలని ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..

అదేవిధంగా తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు వీర మహిళలు, నాయకులు మాట్లాడుతూ టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తుల పై మీడియాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న దృశ్యాలు వస్తున్నప్పటికీ టిటిడి చైర్మన్ వీటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని తక్షణమే వీటిపై చర్యలు చేపట్టి టీటీడీ యొక్క పేరును కాపాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సుభాషిని, ముక్కు సత్యవంతుడు, కీర్తన, అమృత, మునస్వామి, బాటసారి, కొండ రాజమోహన్, లక్ష్మి, మనోజ్, కిశోర్, రాజేష్, హేమంత్, దిలీప్, రాజా, మరియు నాయకులు, జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.