అభ్యుదయ భావాలు కలిగిన పవనన్నను గెలిపించుకుందాం – మాకినీడి శేషుకుమారి

పిఠాపురం రూరల్, గోవిందరాజుపురం, జల్లూరు గ్రామం, రాష్ట్ర అభివృద్ధికై జనసేనకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఇంటి ఇంటికి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి మూడవ రోజు గోవిందారాజపురం, జల్లూరు గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి కావాల్సిన కనీస వసతులు కూడా ప్రభుత్వం సమకుర్చలేకపోతుందని, తమ ప్రభుత్వం అధకారంలోకి వస్తే గ్రామానికి ఎటువంటి సమస్య ఉండకుండా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పిఠాపురం పట్టణ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాశరావు, బూసాల సత్యనారాయణ, బూసాల శ్రీనివాస్, చింతల సత్యనారాయణ, కాటంరెడ్డి మణికంఠ,చింతల అప్పలరాజు, ఇరోతు సత్యనారాయణ, కాళ్ల రాజు, భోదిరెడ్డి భీమరాజు, దేశిరెడ్డి సతీష్, కంద సోమరాజు, గొల్లపల్లి గంగ, గోవిందరాజుపురం జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.