రాష్ట్రంలో దొంగలను తరిమికొడదాం: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో దొంగలు పడే ఐదేళ్లుగా ప్రజలను, రాష్ట్రంలో సంపదను దోచుకుంటున్నారని వారిని తరిమి కొట్టాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 32, 9, 8 వార్డుల్లో కూటమి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో ప్రజలను, రాష్ట్రంలోని గనులన్నింటిని దోచేస్తుంటే నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ అడుగడుగునా దోచేసి ప్రజలను హింసించారన్నారు. అయినా ప్రజలను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ వచ్చేది కూటమి ప్రభుత్వమేనని తాము ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని రాక్షస పాలన తరిమికొట్టేందుకు అంతా బయటికి రావాలని పిలుపునిచ్చారు. నియోజవర్గంలో తనకు ఐదో నెంబర్ గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మకు కమలం గుర్తుపై ఓటు వేసి వైసిపి పాలనకు చర్మ గీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.