డబల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుందాం: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: కూటమి అభ్యర్థులను గెలిపించి కేంద్రంలోని రాష్ట్రంలోని సమర్థంతంగా పనిచేసే డబల్ ఇంజిన్ సర్కార్ని తెచ్చుకోవడం ద్వారా అభివృద్ధి, సంక్షేమం సాధిద్దామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్య పాలెం జగన్నాధపురం గ్రామాల్లో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజలను ఏమార్చి విధ్వంసకర పాలన చేశాడని ఆ పాలన రూపుమాపాలంటే కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు కమలం గుర్తుకు ఓటేయడం ద్వారా, తాడేపల్లిగూడెం నియోజవర్గంలో తనకు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణయ్యపాలెం జగన్నాధపురం గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా వచ్చి తమ అభిమాని నాయకుల ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టిడిపి నేజర్ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోటి తాతాజీలు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.