వైసిపీ దుర్మార్గాల మీద ఉమ్మడిగా పోరాడతాం

  • ఆత్మీయ సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరావు
  • ఆత్మీయ సమావేశ అజెండా
  • ఉమ్మడిగా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇంటింటికి ప్రచారాన్ని జనసేన పార్టీ టీడీపీ నాయకులు సమన్వయముతో నిర్వహించడం.
  • బూత్ ల వారీగా ఓటర్ల జాబితా వెరిఫికేషన్
  • ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చ
  • రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, కరువుపై చర్చ

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం జనసేన పార్టీ – టీడీపీ ఆత్మీయ సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ ప్రయాణంపై చర్చించారు. ఈ సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాజకీయ లాభాపెక్ష లేకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఇద్దరు కలిస్తే ఇక గెలవలేమన్న భయంతో అరాచకాలకు తెరలేపింది. ఇందులో భాగమే టీడీపీ-జనసేన ఓట్లు తొలగించారు. దీని మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాము. త్వరలో మునిసిపల్ కార్యాలయం ముట్టడిస్తాము. ప్రజల్లో వైసిపి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది.ప్రజల తరపున పోరాడతామని తెలియజేసారు. గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. టీడీపీ జనసేన రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం సమావేశం అవ్వటం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా జనసేన-టీడీపీ ఉమ్మడిగా పోరాడబోతుంది. ఇరుపార్టీల సమన్వయము కోసం ఈ ఆత్మీయ సమావేసాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓటర్ల జాబితా అవకతవకల మీద పోరాడబోతున్నాము. డివిజన్ల వారిగా కార్యాచరణ రూపొందించుకోబోతున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.