జనం మెచ్చిన జనసేనలో చేరుతాం!

  • ప్రజా ప్రభుత్వం ఏర్పరుస్తాం అంటూ జనసేన పార్టీలో యువత చేరిక

నెల్లూరు: జనం మెచ్చిన జనసేనలో చేరుతాం, ప్రజా ప్రభుత్వం ఏర్పరుస్తాం అంటూ యువత భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరారు. కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, పెదపావని గ్రామం, జనసైనికుల కోరిక మేరకు వచ్చిన జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ రోజు జనసేన తరపున నిలబడిన, చేరుతున్న ప్రతి ఒక్కరు కూడా విలువలతో కూడుకున్న రాజకీయం చేయడానికి నిలబడిన వారే.. పోటీ చేస్తున్న రెండు పార్టీలు విడిచి జనసేన పార్టీలో చేరటం వీరికి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుతుంది.. పార్టీలో చేరిన అందరూ కష్టపడి ఉమ్మడి జనసేన తెలుగుదేశం బిజెపిల అభ్యర్థులు ఎమ్మెల్యే నాగేశ్వరావు గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని గెలిపించేందుకు కృషి చేయాలి. శ్రీకాకుళం తర్వాత ఎక్కువగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్న కనిగిరి ప్రాంతంలో మంచి నీటి వసతి కల్పించాలని వైఫల్యం చెందారు. 2019లో కనిగిరిలో ఐఐటి కాలేజీ కట్టిస్తానన్న హామీ ఏమైందో ఇప్పటికే తెలియలేదు. ప్రభుత్వ భుముల కబ్జా, ఉద్యోగస్తుల జీతాలు డ్రా చేసి వాడుకోవడం వంటి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గడపగడపకి వెళ్ళినప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బెంగళూరులో ఉంటూ రయల్ ఎస్టేట్ వ్యాపారం చెస్కుంటూ. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారని ప్రజలందరికీ తెలుసు. కందుకూరులో కూడా అదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది. ప్రజలందరికీ ప్రజలు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ని తరిమి కొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు డిపాజిట్లు లేకుండా వైఎస్సార్సీపీని ఓడించాలి. ఇక్కడ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా కనిగిరి లో ఏమీ చేయలేదు, ఎంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. స్ధానికంగా పోటీ చేస్తే ఓడిపోతానని భయంతో ఇక్కడికి వచ్చిన వారే కాబట్టి ప్రజలందరూ బుద్ది చెప్పండి. సూపర్ సిక్స్ గ్యారెంటీలు” ఆంధ్రప్రదేశ్ అంతటా కీలక సమస్యలను పరిష్కరించేందుకు మరియు పౌరుల జీవితాలను మెరుగుపరచ గలవు.. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో జనసేన పార్టీని పెద్దల సూచనల సూచనలతో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.