రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొడదాం: ఆళ్ళ హరి

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ఇచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి చప్పట్లతో మోత మోగించారు. వారాహి విజయయాత్రలో భాగంగా అవనిగడ్డ ప్రయాణ మార్గ మధ్యలో చప్పట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు ఆళ్ళ హరి పిలుపునిచ్చారు.