మట్టిగణపతినే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం

గజపతినగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు మట్టివినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టిన జనసేన నాయకులు మార్రాపు సురేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు మట్టివినాయక ప్రతిమలు సురేష్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందలు మట్టివినాయక ప్రతిమలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పార్టీ ముఖ్యమైన సిద్దంతమైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీయేటా మట్టివినాయక ప్రతిమలను పంచుతున్నామని, అందులో భాగంగానే పంచిపెట్టామని, ప్రజలందరూ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలను పూజించకుండా, మట్టివినాయక ప్రతిమలనే వాడి, పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రవికుమార్ మిడతాన గజపతినగరం నాయకులు పండు, మహేష్, సత్యనారాయణ, హరీష్, అనిల్, శ్రీను, సురేష్ రెడ్డి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.