లైగర్ రిలీజ్ డేట్!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం లైగర్. `సాలా క్రాస్ బ్రీడ్‌` అనేది ఈ సినిమా క్యాప్షన్. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, ఇది చూసిన ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. ఆనందంతో పోస్టర్‌కు బీరాబిషేకాలు చేశారు. కేక్ కటింగ్ లు చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే కరోనా వలన దాదాపు 11 నెలల పాటు ఆగిన ఈ చిత్ర షూటింగ్ నేటి నుండి మొదలు కానుంది.

కొద్ది సేపటి క్రితం మేకర్స్ .. విజయ్ దేవరకొండ పోస్టర్ రిలీజ్ చేస్తూ అఫీషియల్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ సహా మలయాళం, కన్నడ, తమిళ భాషల్లోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. అందరి దృష్టి సెప్టెంబర్ 9పై పడింది. ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.