వరుస ఆఫర్లతో టాక్సీవాలా హీరోయిన్

టాక్సీవాలాలో నటించిన హీరోయిన్ ప్రయాంకా జవాల్కర్ తన అందం, అభినయంతో ఈ భామ అందరిని ఆకర్షించింది. దాంతోపాటు ఈ సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్‌లో ఈ భామ దూసుకెళుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క అవకాశం కూడా లేకుండా అమ్మడు కనుమరుగైంది. ప్రియాంకా షార్ట్ ఫిల్మ్ ద్వారా సినిపరిశ్రమలో అడుగు పెట్టింది. దాంతో పాటు తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. అయినా అవకాశాలు రాలేదు. అయితే ప్రస్తుతం ప్రియాంకా వరుస ఆఫర్లతో బీజీగా ఉంది. టాక్సీవాలా తరువాత ఇన్ని రోజులకు ‘ఎస్ ఆర్ కళ్యణమండపం’ అనే సినిమాతో తిరిగి అవకాశాలను అందుకుంది. దాంతో పాటుగా పాన్ ఇండియా మూవీ ‘గమనం’లో కూడా ప్రియాంకా నటించనుంది.