దిల్లీలో లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా మహమ్మారి దేశ రాజధాని దిల్లీని అతలాకుతలం చేస్తోంది. కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు కేజ్రీవాల్‌ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల17 వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ మరింత కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. మెట్రోసేవలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయని వెల్లడించారు. దిల్లీలో పాజిటివిటీ రేటు కాస్త తగ్గినప్పటికీ.. లాక్‌డౌన్‌ కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆరోగ్య మౌలిక వసతులను పెంచేందుకు కృషి చేశామని.. ఆక్సిజన్‌ కొరతే ప్రధాన అంశమని సీఎం పేర్కొన్నారు. అయితే కేంద్రం సహాయంతో ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పారు.

దిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ 23 శాతం కూడా ఎక్కువే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.