తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు..

తమిళనాడులో కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను స్టాలిన్‌ ప్రభుత్వం మరో వారం పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు ఈ పొడిగింపు కొనసాగనుంది. ఆదివారం నుండి లాక్‌డౌన్‌ అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందు నిమిత్తం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేటు ఉద్యోగులు..ఇంటి వద్ద నుండే పనిచేయాలని కోరింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. ఆదివారం నిత్యావసర దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తెరచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. అంతర్‌ జిల్లాల్లో వైద్య పరమైన ప్రయాణాలకు ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది. హోటళ్లు తెరిచేందుకు అనుమతినివ్వలేదు. కేవలం పార్సీల్‌ సర్వీసులకు మాత్రమే అనుమతినిచ్చింది. శుక్రవారం రాష్ట్రంలో ఒక్క రోజే 467 మంది మరణించారు. క్రితం రోజు మరణాల సంఖ్యతో పోలిస్తే…శుక్రవారం నమోదైన మరణాల సంఖ్య 17.6 శాతం అదనం. అంతేకాకుండా 36,184 కొత్త కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.