మాల్యాడ గ్రామానికి పండుగ వాతావరణాన్ని తెచ్చిన లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, మాల్యాడ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి నిర్మాణానికి నోచుకోకుండా ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయాన్ని గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు జనసేన నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవి వద్దకు తీసుకొని వెళ్లారు. గ్రామస్తులు మరియు గ్రామ పెద్దల నుండి విషయం తెలుసుకున్న శ్రీమతి లోకం మాధవి వెంటనే స్పందించి ఆ దేవాలయ నిర్మాణానికి కావలసిన ఇతర సామాగ్రి గురించి ఆరాతీసి వెంటనే ఆలయ నిర్మాణం పూర్తిచేసే బాధ్యతను శ్రీమతి లోకం మాధవి తీసుకుంటానని గ్రామ ప్రజలకు మాటిచ్చారు. అందులో భాగంగా ఆ దేవాలయానికి సుమారు ఐదు లక్షల రూపాయలు విలువచేసే గ్రానైట్ మరియు టైల్స్ ని శ్రీ సీతారాముల దేవాలయానికి అందజేశారు. కాగా జూన్ నెలలో ఆలయ పనులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ శనివారం రోజున మల్యాడ గ్రామస్తులు
శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామ ఆలయ ప్రతిష్టను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్యాడ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయ ప్రతిష్టకు హాజరైన శ్రీమతి లోకం మాధవి గారిని గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. మాధవి గారిని చూసిన గ్రామ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నా ఆలయ నిర్మాణానికి తమ తోడ్పాటు తోడవడం చాలా సంతోషకరమని, ఈ తోడ్పాటును మరియు సహకారాన్ని తాము ఇప్పుడు మరువబోమని మల్యాడ గ్రామానికి చెందిన మహిళలు తెలియజేశారు. శ్రీ కోదండ రాములవారిని దర్శించుకున్న లోకం మాధవి అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లోకం మాధవి మాట్లాడుతూ.. రాములవారి ఆలయ నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని, మల్యాడ గ్రామం ఈరోజు పండుగ వాతావరణాన్ని తలపించిందని తెలిపారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆగేది కాదని, మీలో ఒక మనిషిగా ఎప్పుడు మీతోనే మీ కోసమే ఉంటానని మాధవి తెలియజేశారు. అనంతరం అక్కడ ఉన్న మహిళలతో మాధువి ముచ్చటించారు. సదరు మహిళలు మాధవి గారితో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు.