శ్రీ సామాలమ్మ తల్లిని దర్శించుకున్న లోకం మాధవి

  • శ్రీ సామాలమ్మ ఆలయ నిర్మాణానికి 1,50000 రూపాయల విరాళం

నెల్లిమర్ల నియోజవర్గం: నెల్లిమర్ల జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి లోకం మాధవి బుధవారం పుసపాటిరేగ మండలం, చింతపల్లి గ్రామ దేవత శ్రీ సామాలమ్మ తల్లిని దర్శించుకొనుటకు, అలాగే ఆశీర్వచనాలు పొందుటకు చింతపల్లి విచ్చేశారు. చింతపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నో దశాబ్దాలు నుంచి వెలుగును నింపుతున్న శ్రీ సామాలమ్మ తల్లికి గుడి కట్టించడం మంచి శుభ పరిణామంగా భావించారు.
శ్రీ సామాలమ్మ ఆలయ నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా నిర్మాణానికి కావలసిన గ్రానైట్ లేదా, గ్రిల్స్ ఏర్పాటు నిమిత్తం 1,50,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. తన పర్యటనలో భాగంగా మాధవి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా చెప్పినటువంటి సమస్య నీటి కొరత, తాము ఎన్నో ఏళ్ల నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, మంచినీరు దొరకడం తమకి ఎంతో కష్టతరంగా మారిందని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, స్థానిక నాయకత్వాన్ని ప్రశ్నిస్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చింతపల్లి గ్రామస్తులు వాపోయారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చినాక నియోజకవర్గంలో చేపట్టబోయే మొట్టమొదటి ఇంటింటికి కులాయి అని తాను ఇతర నాయకులు లాగా ఎన్నికల సమయంలో కల్లి బుల్లి మాటలు చెప్పనని ఎంతో చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల యొక్క బాగునే తన ముఖ్య ఉద్దేశమని మాధవి తెలియజేశారు.