మదనపల్లెలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

మదనపల్లె: టిడిపి పార్టీ అథ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి మదనపల్లె జనసేన పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లి చిత్తూరు బస్టాండ్ కూడలిలో మరియు టిడిపి పార్లమెంట్ ఆఫీసులో కేక్ కటింగ్ టిడిపి నాయకులు తెలుగుదేశం రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, టిడిపి రైతు విభాగ రాష్ట్ర చైర్మన్ రాటకొండ మధుబాబు మరియు రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాదగిరి దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన లోకేష్ జన్మదిన వేడుకల్లో మదనపల్లె జనసేన నాయకులు శ్రీ రామాంజనేయలు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మరియు జనసేన వీరమహిళ రూప, జనసేన నాయకులు జనసేన సోను, మలసాని వినయ్, తొక్కల శివ, యాసిన్, గణేష్, బహుదూర్, ధరణి, శేఖర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.