రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: జనసేన నేతలు

ప్రత్తిపాడు నియోజకవర్గం, కాకుమాను మండలం, అప్పాపురం గ్రామంలో మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించిన జనసేన పార్టీ నాయకులు. మూడు రోజుల క్రితం తుఫాను వల్ల కురిసిన అకాల వర్షాలకు రైతాంగం అల్లాడిపోతోంది. ఒక్క ఎకరం పొలం కూడా సరైన స్థితిలో లేదు. వరి, పొగాకు, పత్తి, మిరప, శనగ లాంటి పంటలు పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. ఈ సందర్భంగా పత్తిపాడు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాను రైతాంగం ఇళ్లల్లో కన్నీరు అప్పులు మాత్రమే మిగిల్చింది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని, ఎకరానికి 50,000 ఇస్తే తప్ప రైతు కోరుకునే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ జనసేన తెలుగుదేశం పార్టీలు రైతాంగానికి అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య రత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం త్వరగా స్పందించి రైతాంగాన్ని ఆదుకొని, ఎకరాకు 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పారు. అలాగే కౌలు రైతును కూడా పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందనన్నారు. ప్రధాన పంటలైన ప్రత్తి, వరి, మిరప, శెనగ, పొగాకు , పెసర ,మినుము మొదలైన పంటలు రైతుల చేతికి అందివచ్చే టైంలో దెబ్బతినటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారని వెంకటరత్తయ్య అన్నారు. అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విత్తనం నాటుకునే మొదట్లో నీరు లేక వాటర్ ట్యాంకులు పెట్టుకొని పొలానికి నీళ్లు పెట్టుకున్నారని, తీరా పంట ఇంటికొచ్చే సమయానికి ఈ తుఫాను పంటలను పూర్తిగా దెబ్బ దెబ్బతీయటం హృదయ విదారక దృశ్యం అని అన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఎకరాకు నష్టపరహారం అందించాలని లేదంటే జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. అలాగే కాకుమాను మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక అప్పాపురం గ్రామం మాత్రమే కాదు, మండలంలో ఉన్న ప్రతి ఎకరా కూడా పూర్తిగా దెబ్బ తిన్నాయని రైతులను ఆదుకోవాలని అలాగే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లేకపోతే రైతు కోలుకునే పరిస్థితి లేదని శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాకమాను మండల నాయకులు పిచ్చయ్య నూతి శరత్, గాజుల సత్యనారాయణ, నాగరాజు, ఆనంద్, సుధీర్, గోపికృష్ణ, పెదనందిపాడు మండల నాయకులు వల్లంశెట్టి లలిత్ మరియు స్థానిక రైతులు, జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.