పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లొల్ల గ్రామ రైతులు

రైతులకు న్యాయం చేయగలిగే ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మాత్రమే ఆర్థిక ఇబ్బందులతో సతమతమై.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు లక్ష రూపాయలు ప్రకటించి వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేస్తూ.. లొల్ల గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కల్లూరి పుత్ర సాయిరాం ఆధ్వర్యంలో.. గ్రామ కౌలు రైతులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు కల్లూరి త్రిమూర్తులు(సుమన్), పుల్లేటికుర్తి వీరభద్రంగారు, అబ్బిరెడ్డి ధనరాజ్, పైడికొండల సత్తిపండు, వస్కా బంగారు బాబు, తుము భద్రం, కల్లూరి సుబ్బారాయుడు, బండి రామాంజనేయులు, చిక్కాల ప్రసాద్, కాకులపాటి వెంకటేశ్వరరావు, తూము సత్యనారాయణ, జనసైనికులు రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.